రాజీపడితేనే కేసుల పరిష్కారం
జనగామ రూరల్: పంతాలకు పోకుండా రాజీపడితేనే కేసులు పరిష్కారమవుతాయని, రాజీమార్గమే రాజా మార్గం అని కక్షిదారులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మాట్లాడుతూ..ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీ పడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. డీసీపీ రాజా మహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు పోట్లాడుకోకుండా పరిష్కరించుకుంటే ప్రశాంతంగా ఉంటారన్నారు. ఈసందర్భంగా మొత్తం 330 కేసులు పరిష్కరించగా ఇందులో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 319, యాక్సిడెంట్ కేసులు 6..పరిష్కరించి వివిధ పెనాల్టీల ద్వారా రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్లు కోర్టు అధికారులు తెలి పారు. సీనియర్ సివిల్ జడ్జి ఇ. సుచరిత, జూని యర్ సివిల్ జడ్జీలు కుమారి జి.శశి, కె. సందీప, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. వెంకట్‌రామ్ నరసయ్య, న్యాయవాదులు కె.సునీతారాణి, బి.స్వప్న, టి.భవాని, ఎన్.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ


