అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీఓలు, హౌసింగ్ పీడీ, ఎంపీడీఓల, ఇంజనీరింగ్ అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన ప్రతీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంకా నిర్మాణం ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే తెలుసుకోవాలని సూచించారు. ఎస్‌హెజ్‌సీ గ్రూప్‌ల ద్వారా లబ్ధిదారులకు రుణాలు చేసి నిర్మాణాలు ప్రారంభించే విధంగా సహకరించాలన్నారు. సూర్యాపేట నుంచి వస్తున్న ఇసుకను త్వరగా సరఫరా చేసి లబ్ధిదారులకు అందించే విధంగా మైనింగ్ అధికారిని ఆదేశించారు. పీఎం ఆవాజ్ యోజన పథకానికి సంబందించిన లబ్ధిదారుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా


