యువత సామాజిక సేవలో ముందుండాలి
జనగామ: యువత సామాజిక సేవలో ముందుండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనా రాయణ పిలుపునిచ్చారు. సూర్యాపేటరోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం వాస్విక్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం జరుగగా, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేందర్ నాయక్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి, సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరకదన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అ లవాటు చేసుకుని, చదువుతో పాటు సేవా మార్గం వైపు ముందుకు వెళ్లాలని యువతకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ నరేష్ కు మార్, నూకల భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ


