పత్తి రైతులను ఆదుకోవాలి
జనగామ రూరల్: సీసీఐ నిబంధనలు సడలించి పత్తి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో పత్తి దిగుబడి తగ్గిందని, చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే అధికారులు నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అఖిలపక్షాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్, మంగ బీరయ్య, తదితరులు ఉన్నారు.


