టెట్‌కు వేళాయె..
ఉపాధ్యాయ ఖాళీలు ఇలా
అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం
టీచర్లకు ప్రత్యేక సడలింపు
విజయమే లక్ష్యంగా..
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రిపరేషన్ సందడి మొదలైంది. ఖాళీల సంఖ్య, రాబోయే పదవీ విరమణలు, టెట్ అర్హత అవసరం కారణంగా ఉపాధ్యాయ వర్గాల్లో కొంత మేర టెన్షన్ నెలకొనగా, నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో సాధన ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనుండగా, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
400 మంది మాత్రమే అర్హత..
జిల్లాలో ఎస్జీటీ, స్కూల్‌అసిస్టెంట్, ఇరత కేట గిరీ ల్లో ఉన్న 483 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఈ ఖాళీల భర్తీకి రానున్న టెట్ ముఖ్య భూమి క పోషించనుంది. జిల్లాలో పీఎస్, యూపీఎస్, ఉ న్నత పాఠశాలల పరిధిలో 2,115 మంది టీచర్లు పని చేస్తున్నారు. ఇందులో జిల్లాలో 2010కు ముందు చేరిన 1,307 మంది ఉపాధ్యాయులకు టెట్ రా యడం తప్పనిసరి. వీరిలో ఇప్పటి వరకు సుమారు 400 మంది మాత్రమే టెట్ అర్హత సాధించారు. మిగతా 900 మంది అర్హత పరీక్ష ద్వారా తమ భ విష్యత్‌ను పరీక్షించుకోనున్నారు. అయితే 474 మంది టీచర్లు 5ఏళ్ల లోపు పదవీవిరమణ దశలో ఉండటంతో వారికి టెట్ మినహాయింపు ఉంటుంది.
కోచింగ్ సెంటర్లకు డిమాండ్..
జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో టెట్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి జిల్లాలో సుమారు 4వేల మంది అభ్యర్థులు పేపర్–1, పేపర్–2లకు హాజరుకానున్నారు. జిల్లా గ్రంథాలయంతో పాటు ప్రైవేట్, ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్లు తదితర మార్గాల ద్వారా శిక్షణ తీసుకుంటున్నారు. ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నందున టెట్ అర్హత అత్యంత కీలకమైంది.
కేటగిరీ ఖాళీలు
ఎస్జీటీ 307
పీఎస్ హెచ్‌ఎం 6
స్కూల్ అసిస్టెంట్లు..
మ్యాథ్స్ 9
ఫిజిక్స్ 12
బయోసైన్స్ 17
సోషల్ స్టడీస్ 30
తెలుగు 20
హిందీ 12
ఇంగ్లిష్ 8
ఉర్దూ 1
ఫిజికల్ డైరెక్టర్లు 5
లాంగ్వేజ్ పండిట్స్ 6
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 24
టీచర్ల భవిష్యత్‌కు పరీక్ష
జిల్లాలో రాయనున్న
9,00 మంది ఉపాధ్యాయులు,
4వేల మంది నిరుద్యోగులు
ఈనెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 1వ తేదీన వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 5 సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు, పదోన్నతి అవసరమనుకుంటే రాబో యే రెండేళ్లలో టెట్ తప్పనిసరి పాస్ కావాలని, లేదంటే ఉద్యోగాలు కోల్పోతారని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు ఉన్న టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రస్తుత సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టెట్‌లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కోర్టు ఆదేశాల మేరకు టెట్ తప్పనిసరిగా ఇన్ సర్వీస్ టీచర్లు రాయాలని చెబుతూ, కొన్ని ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.
టెట్ పరీక్షపై కొత్తగా రాసే అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లలో ఆందోళన కనిపిస్తున్నప్పటికీ ఉత్తీర్ణత సాధించడం చాలా సులభం. ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా మంచి మార్కులు సాధించగలరు. పేపర్–1లో 3 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై పట్టు పెంచుకోవడం కీలకం. పేపర్–2లో తెలుగు, సైకాలజీ, సోషల్ విభాగాల్లో మార్కులు రాబట్టడం సులభం. మ్యాథ్, సైన్స్ విభాగాల్లో కూడా ఇన్ సర్వీస్ టీచర్లు కొద్దిగా ప్రిపేర్ అయితే సులభంగా పాస్ అవుతారు.
– రావుల రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
టెట్‌కు వేళాయె..
టెట్‌కు వేళాయె..


