బాబోయ్..చలి
జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రతలు
జిల్లాలో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చలి మంట కాచుకుంటున్న యువకులు
జనగామ: జిల్లాలో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కూర్చున్న చోటనే ప్రజలను గజగజ వణికిస్తోంది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల వరకు పడిపోగా, సాయంత్రం ఐదు గంటలకే గడ్డకంటే చలి చంపేస్తోంది. రాత్రి 7 గంటల నుంచే వీధులు నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీ జీవనం స్తంభించి పోతుంది.
కూలీలు, కులవృత్తుల వారి పరిస్థితి దారుణం
జనగామ మార్కెట్ యార్డు, పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో రాత్రిపూట పని చేసే హమాలీలు చలికి వణికిపోతూ భారమైన బస్తాలను మోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బచ్చన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, దేవరుప్పు ల, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారు జాము నుంచి పొగమంచు కమ్ముకోవడంతో కూలీలు పని స్థలాలకు చేరుకునేంతవరకు చలితో ప్రయాణం చేస్తున్నారు. జనగామ ఆర్టీసీ బ స్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద రాత్రి వేళలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చలిలో వణుకుతూనే వెళ్తున్నారు. చలి మంటలతో పడిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేకువ జామున పేపర్ బాయ్‌లు, పాడి రైతులు, పూలు, పాల వ్యాపారులు చలిని లెక్కచేయకుండా తమ పనులను చేస్తుండటం కష్టసాధ్యమైపోయింది.
వణికించే చలిలో విద్యార్థులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలి తీవ్రతతో గదుల్లోనే ఉండిపోతున్నారు. రాబోయే 10, ఇంటర్, డిగ్రీ పరీక్షలతో పాటు టెట్, ఇతర పోటీ ఎంట్రెన్స్‌లకు సిద్ధమవుతున్న విద్యార్థులు రాత్రి, ఉదయం ఉన్ని దుస్తులతో చదువుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో పట్టణంలోని బస్టాండ్ సెంటర్, రైల్వేస్టేషన్, సిద్దిపేట, నెహ్రూపార్కు, సూర్యాపేట, హైదరాబాద్, హనుమకొండ తదితర ప్రాంతాల రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జిల్లాలో ఉన్ని దుస్తుల వ్యాపారం ఊహించని విధంగా పెరిగింది.
తేదీ కనిష్టం గరిష్టం
8 13 26
9 14 27
10 14 26
11 15 27
12 16 28
13 15 28
14 15 30
హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దారుణం
నిర్మానుష్యంగా రహదారులు
పగటిపూట వదలని చలి
బాబోయ్..చలి
బాబోయ్..చలి
బాబోయ్..చలి
బాబోయ్..చలి


