మాతృశ్రీ క్లినిక్ సీజ్
కొడకండ్ల: మండలకేంద్రంలోని మాతృశ్రీ ప్రథమ చికిత్సాలయాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ మల్లి కా ర్జునరావు సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా స్థాయికి మించి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు డీ ఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో పీఓ డాక్టర్ కమల్, వైద్యాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామస్తులకు సేవలందిస్తున్న మాతృశ్రీ క్లినిక్‌ను సీజ్ చేయొద్దంటూ స్థానికులు క్లినిక్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.
డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి
కొడకండ్ల: డయాబెటిస్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు సూచించారు. శుక్రవారం ప్రపంచ డయాబెటిస్‌డేను పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ పాల్గొని మాట్లాడుతూ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనర్థాలు రాకుండా జాగ్రత్త పడొవచ్చని, డయాబెటిస్ రోగులు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం చేయడంతో పాటు రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ డాక్టర్ కమల్, డాక్టర్లు హరికృష్ణ, భారతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిబంధనలు విస్మరిస్తే చర్యలు
దేవరుప్పుల: గ్రామీణ వైద్యులు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రథమ చికిత్సకు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండిపడుతున్న స్థానికులు


