వేటా? బదిలా?
డిజిటల్ సాక్ష్యాలు స్వాధీనం
ఆ ఇద్దరు ఎంపీఓలపై కూడా..
జనగామ/బచ్చన్నపేట: పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఎంపీఓల వ్యవహారంపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సీరియస్ అయ్యారు. ‘దందా ఎంపీవోలు’ శీర్షికన ఈ నెల 13న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బచ్చన్నపేట మండల కేంద్రంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(డీఆర్‌ఓ) సుహాసిని, డీపీఓ నవీన్, డీఎ ల్‌పీఓ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండున్నర గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. ఎంపీఓ వెంకట మల్లికార్జున్‌పై ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీఓతో వేర్వేరుగా మాట్లాడారు. డబ్బుల వసూళ్లపై ఆరా తీసి, లిఖిత పూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దీంతో పాటు కార్యదర్శుఽలపై ఒత్తిడి తెస్తూ, బలవంతంగా బీమా పాలసీలను చేయిస్తున్న ఆ ఎంపీఓ ఎవరనే దానిపై కూపీలాగుతున్నారు.
కుటుంబ సభ్యుల పేరిట ఏజెంట్ల వ్యవహారం
ఓ ఎంపీఓ తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బీమా ఏజెంట్లకు పాలసీలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు పంచాయతీ శాఖలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో పాలసీల ముచ్చట పక్కనబెట్టి.. గప్‌చుప్ అయ్యారు. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ, పరిపాలన చక్కదిద్దాల్సిన అధికారులు, కిందిస్థాయిలో పనిచేస్తున్న వారిని వేధిస్తూ అనేక రూపాల్లో వసూళ్లకు పాల్పడుతుండ డం.. జిల్లాకు చెడ్డ పేరు తెచ్చేలా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో, వారు సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. పంచాయతీ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ రకమైన దందాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, దోషులను వదలొద్దని ప్రజలు కోరుతున్నారు.
వసూళ్లు ఇలా..
బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎంపీఓగా పనిచేస్తున్న వెంకటమల్లికార్జున్‌పై 18 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మూడు రోజుల క్రితం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సదరు ఎంపీఓ బచ్చన్నపేట ఎంపీడీఓగా ఏడాది పాటు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. కార్యదర్శుల సర్వీస్ బుక్కులో సంతకం, కార్యదర్శులకు సెలవు మంజూరు, రికార్డులు వెరిఫికేషన్, పలు యాప్‌లను ఆన్‌లైన్ చేసేందుకు జీపీ స్థాయిని బట్టి ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు తీసుకున్నట్లు వారు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు కార్యదర్శుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ దూషించేవారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఎంపీఓ గ్రామానికి వచ్చిన సమయంలో తన వాహనంలో డీజిల్ కోసం డ్రైవర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీఓపై వేటు వేస్తారా లేదా బదిలీతో సరిపెడుతారా? అనేది వేచిచూడాలి.
13జెజిఎన్051:
13జెజిఎన్052:ఎంపీఓ దందాలపై సాక్షిలో ప్రచురితమైన కథనం
విచారణలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఎంపీఓ, ఆయన డ్రైవర్‌కు పంపిన డబ్బుల స్క్రీన్‌షాట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో తుది నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించనున్నారు.
జిల్లావ్యాప్తంగా ఎంపీఓల వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరో ఇద్దరు ఎంపీఓలు కూడా ఈ దందాలో భాగస్వామ్యులయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. వారికి సంబంధించిన వివరాలు సేకరించడానికి అధికారులు ఆరా తీస్తున్నారు.
అధికారి వ్యవహారంపై కలెక్టర్ సీరియస్
బచ్నన్నపేటలో రెండున్నర గంటల పాటు విచారణ
ఇరువురి వాంగ్మూలం సేకరణ
బీమా పాలసీలు చేసిన ఎంపీఓ
ఎవరని ఆరా
‘దందా ఎంపీఓలు’ కథనానికి స్పందన
వేటా? బదిలా?
వేటా? బదిలా?


