ధాన్యం డబ్బుల చెల్లింపులో జిల్లా ఫస్ట్
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతి..
జనగామ రూరల్: వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం డబ్బుల చెల్లింపులో రాష్ట్రస్థాయిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ధాన్యం కొనుగోలు పురో గతి మీద వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 7,657 మంది రైతుల నుంచి 3,70,99.52 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.61కోట్లు చెల్లించామన్నారు. అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్‌పై అవగాహన కల్పించండి
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయిల్‌పామ్ పంట విస్తరణ పై ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..3,500 మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1,200 మొక్కలకు మంజూరు పూర్తి అయ్యిందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని, జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి కోదండరాములు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇన్‌చార్జ్ శంకర్ పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు కలెక్టరేట్‌లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా క్యాంపును పరిశీలించి కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
జనగామ: ప్రభుత్వం అర్హత పరీక్ష ద్వారా రిక్రూట్ చేసిన లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్లకు కమీషన్ ఆధారంగా కాకుండా, గౌరవ వేతనంతో ఉపాధి కల్పించాలని కోరుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ల్యాండ్ సర్వే ఏడీ మన్యంకొండకు వినతి చేశారు. అనం తరం సర్వేయర్లు బి.గణేష్‌కుమార్, బి.రాజు, రాజేంద్రప్రసాద్, శోభ, రంజిత్ మాట్లాడుతూ.. లైసెన్డ్ సర్వే విభాగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా


