సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారు. గురువారం సోమేశ్వరాలయంలో ఎ మ్మెల్యే యశస్వినిరెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం గుట్ట శిఖరం, పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, అఖండజ్యోతి నిర్మాణం, మెట్ల ఏర్పాటు, పంచగూళ్ల ఆలయం దగ్గర నుంచి గుట్టపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఇతర పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
దేవరుప్పుల: ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు సాధ్యమని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నా రు. మండలంలోని చిన్నమడూ రు రెవె న్యూ పరిధి రంబోజీగూడెం గ్రామ పంచాయతీ పరిధి తలపెట్టిన మెగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సేకరించిన 27 మంది భూనిర్వాసితులకు క్యాంపు కార్యాలయంలో రూ.80 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. జనగామ ఆర్టీఓ గోపిరామ్, తహసీల్దార్ ఆడెపు అండాలు, కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్, వెంకన్న, పరీదుల భాస్కర్, పెండ్లి సోమిరెడ్డి, రామచంద్రునాయక్ పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


