మత్తుపదార్థాలు, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
జనగామ: విద్యార్థులు మత్తు పదార్థాలు, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం జనగామ మెడికల్ కళాశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు. ర్యాగింగ్ చట్టపరంగా శిక్షార్హమైన నేరమన్నారు. ర్యాగింగ్ ఘటనలకు సంబంధించి కదలికలు మొదలవగానే అధికారులతో పాటు విద్యార్థులు కూడా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులచే యాంటీడ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ చెన్నకేశవులు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల సదస్సులో డీసీపీ రాజమహేంద్ర నాయక్


