పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎన్‌జీఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ కోరారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సంఘ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసి, డీఏలను విడుదల చేయాలన్నారు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, కోశాధికారి హాఫిజ్, అసోసియేట్ అధ్యక్షుడు రాజనర్సయ్య, ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, రాంనర్సయ్య, ఉప్పలయ్య, స్టెల్లా, నాగార్జున, శ్రీధర్ బాబు, యాకుబ్ పాషా పాల్గొన్నారు.


