పండుటాకులను గౌరవిద్దాం
సేవే మానవతా విలువ..
వారం రోజుల షెడ్యూల్..
జనగామ రూరల్: మన జీవితంలో తల్లిదండ్రుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. వయసు మీద పడి బలహీనంగా మారినా, వారి అనుభవం మాత్రం అచంచలమైన మార్గదర్శకం. అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారిపై మన కర్తవ్యాలను గుర్తుచేస్తుంది. ఈ రోజు వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, హక్కులను రక్షించడం, సమాజంలో గౌరవంగా నిలిపేలా చైతన్యం కల్పించడం అందరి ప్రధాన లక్ష్యం. వృద్ధులు ఒంటరితనంతో బాధపడకుండా వారితో సమయాన్ని గడపడం, చిన్నపాటి మాటతోనైనా సాంత్వన ఇవ్వడం వారికి కొత్త జీవం ఇచ్చిన వారమవుతాం. ఈ ఏడాది అక్టోబర్ 1న రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌తో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 13 నుంచి 19వరకు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నారు.
వృద్ధుల హక్కులివి..
వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. వృద్ధాప్య పింఛను పథకం ద్వారా నెల నెలా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యశ్రీ, వృద్ధాశ్రమాలు, డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ 14567 ద్వారా వృద్ధుల భద్రత, సేవలపై ఫిర్యాదులు స్వీకరించే సౌకర్యం కల్పించారు. అలాగే పోషణ చట్టం–2007 ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణ చేయడం చట్టబద్ధ బాధ్యతగా నిర్దేశించారు. ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి పోషణకు న్యాయబద్ధమైన హక్కు పొందవచ్చు.
వృద్ధుల జ్ఞానం..సమాజానికి
వెలుగు దీపం
తల్లిదండ్రుల సంరక్షణతోనే
సుస్థిర సమాజం
నేటినుంచి వయోవృద్ధుల
వారోత్సవాలు
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
వృద్ధులను గౌరవించడం మన సంస్కృతికి ప్రతీక అని, వారి అనుభవం సమాజానికి మార్గదర్శకం అవుతుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులు సమాజంలో గౌరవంగా, భద్రతగా జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం నుంచి 19 వరకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాల నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కన్నా పరుశురాములు, హరిబాబు, క్యాథరిన్, సీనియర్ సిటిజన్‌న్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ది మల్లయ్య, మల్లారెడ్డి, రామస్వామి, ఫీల్డ్ రెస్పాన్‌న్స్ ఆఫీసర్ రాజు, సఖి సెంటర్ ప్రతినిధి రేణుక, డీసీపీఓ రవికాంత్, డీఎంసీ శారద ఉన్నారు.
13వ తేదీ: వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు
14: వయోవృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు
15: సీనియర్ సిటిజన్ల హక్కులపై
అవగాహన ర్యాలీ
17:ఆరోగ్యం, చురుకై న వృద్ధాప్యంపై
అవగాహన కార్యక్రమం
18:గ్రామ స్థాయిలో సర్పంచులు,
ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశాలు
19:జిల్లాస్థాయిలో అంతర్జాతీయ
వయోవృద్ధుల దినోత్సవ సంబురాలు
పండుటాకులను గౌరవిద్దాం


