ఘనంగా పూర్ణాహుతి
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగే తంతులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితులు విజయసారథి, శ్రీనివాసారాచార్యులు, భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు వేదమంత్రచ్ఛరణలో నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, లక్ష్మి, వెంకటేశ్వర్లు, వెంకన్న, బుచ్చిరెడ్డి, సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: జనగామ మెడికల్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో పారా మెడికల్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌న్ విడుదలైందని కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్‌న్(రెండేళ్లు), డిప్లొమా ఇన్ ఆప్తాలమిక్ అసిస్టెంట్(రెండేళ్లు) కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంపీసీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆ కోర్సుల విద్యార్థులు అందుబాటులో లేకుంటే ఇతర ఇంటర్మీడియట్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఈ నెల 27వ తేదీ అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జనగామ మెడికల్ కళాశాలలో దరఖాస్తులను అందించాలన్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కళాశాల వెబ్‌సైట్ www.gmcjanga on.org లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లుల ఆన్‌లైన్ చెల్లింపులు సులభం
జనగామ: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్‌పీడీసీఎల్) ఆధునిక ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని ఎస్‌ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. బుధవారం ఆయన సర్కిల్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాదాపు 10శాతం వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, టీ వాలెట్, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ సేవల ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 3,65,494 మంది వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించగా, ఈ ఏడాది 2025 నవంబర్ 11 వరకు 3,08,869 మంది డిజిటల్ పేమెంట్లు చేసినట్లు చెప్పారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, సులభతర సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు.
జూడో టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: భోపాల్‌లోని సెజ్ యూనివర్సిటీలో ఈనెల 13, 14 తేదీల్లో జరగబోయే సౌత్ వెస్ట్ జోన్ జూడో టోర్నమెంట్‌కు కేయూ జూడో పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టులో ఎల్.లక్ష్మణ్, ఎం.ధీరజ్ (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శివాజీ (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), బి.జయదీప్ (సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వరంగల్), ఎం.సాయికిరణ్ నాయక్ (యూసీపీఈ.కేయూ, వరంగల్), ఎం.దర్శిత్‌నాయక్ (ఎల్‌బీకాలేజీ, వరంగల్) ఉన్నారు. ఈజట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.కిషన్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.
క్యాస్ ఇంటర్వ్యూలకు
10 మంది అధ్యాపకులు
కేయూ క్యాంపస్: కేయూలో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (క్యాస్) కింద అధ్యాపకుల పదోన్నతికి ఇంటర్వ్యూలు కొనసాగుతున్నా యి. ఈమేరకు బుధవారం నిర్వహించిన వివిధ విభాగాల్లో పదోన్నతుల కోసం 10 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇందులో సోషియాలజీ విభాగంలో ఇద్దరు, లైబ్రరీ సైన్స్ విభాగంలో ఒకరు, ఇంగ్లిష్ విభాగంలో ఒకరు, ఇంజనీరింగ్ సీఎస్‌ఈ విభాగంలో ఐదుగురు హాజరయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగాను పదోన్నతి కల్పించనున్నారు. ఇంటర్వ్యూల ప్రక్రియలో వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం.. ఆయా విభాగాల సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్, డీన్లు పాల్గొన్నారు. ఈనెల 13న ఇంజనీరింగ్ విభాగాల్లో ఈసీఈ, ఎంఈ, ఈఈఈ, యూనివర్సిటీ లా కాలేజీలోని అధ్యాపకుల పదోన్నతుల ఇంటర్వ్యూలతో ఈ ప్రక్రియ ముగియనుంది.


