లక్షలు పోసింది.. పార్కింగ్ కోసమా?
మార్కెట్ యార్డులో పార్కింగ్ స్థలంగా మారిన కవర్‌షెడ్
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు తమ సరుకులను అమ్ముకునేందుకు లక్షలు ఖర్చుచేసి నిర్మించిన కవర్‌షెడ్‌ను పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కవర్‌షెడ్‌లో సీసీ నిర్మాణం చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ గాలికి వదిలేశారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ధాన్యం, మక్కలు, తదితర సరుకుల విక్రయానికి అవసరపడే కవర్‌షెడ్ ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోయింది. నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం గమనార్హం.
– జనగామ


