ప్రజాసేవలోనే నిజమైన ఆనందం
పాలకుర్తి టౌన్: ప్రజాసేవలోనే నిజమైన ఆనందం ఉందని, హెచ్‌ఆర్‌జేఆర్ ట్రస్ట్ ఆరోగ్య సేవల్లో మందంజలో ఉంటుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్‌లో శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి రాజేందర్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ..పాలకుర్తి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరుచుగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ ఎల్. మంజుల, మండల వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి, శంకర్ ఆస్పత్రి వైద్యురాలు మనోజ్ఞ, హెచ్‌ఈఓ రమణమ్మ, ఏఓ భూక్య బాలజీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గిరిగాని కుమారస్వామి, పెద్దగాని సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్యశిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


