విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు..
రఘునాథపల్లి: రఘునాథపల్లి స్టేషన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో బిల్డింగ్ ఎక్కించి చీపుర్లతో వెట్టిచాకిరి పనులు చేయించారని అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఠాకూర్ గణేశ్‌సింగ్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. పిల్లలకు చదువు చెప్పకుండా విద్యార్థులను పని మనుషులుగా పనులు చేయించడం సమంజసం కాదని, ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ విద్యార్థులతో ఇటుకలు మోయించడం లాంటి పనులు చేయించారని, రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయుల తీరు మారలేదని పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పాఠశాలల్లో విద్యార్థులను బానిసల్లా మారుస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులపై
కలెక్టర్‌కు ఫిర్యాదు


