సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి శక్తిఆయుధం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మిశ్రమ వెండితో తయారుచేసిన శక్తిఆయుధాన్ని భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌కు చెందిన భక్తుడు గంగిశెట్టి రాజ్‌కుమార్, కళా రాణి దంపతుల కుమారుడు గణేష్‌కు ఉద్యోగం రావడంతో మొదటి నెల వేతనంతో ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.70వేల విలువైన 458 గ్రాముల మిశ్రమ వెండితో తయారుచేయించిన శక్తి ఆయుధం ఆలయానికి అందజేసినట్లు ఈఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా రథోత్సవం
లింగాలఘణపురం: మండలంలో జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఘనంగా సీతారాముల రథోత్సవం జరిగింది. ఈనెల 10న కల్యాణం జరిగిన సీతారాముల విగ్రహాలను రథంపై ఊరేగించారు. రథాన్ని రంగురంగుల విద్యుత్ లైట్లు, పూలతో అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు రథాన్ని రామనామ స్మరణ చేసుకుంటూ భక్తిశ్రద్ధలతో లాగుతూ వెళ్లారు. చేస్తూ లాగుకుంటూ వెళుతుండగా రథోత్సవాన్ని నిర్వహించారు. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు, ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రోజు రామస్వామి కోరారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష నిర్వహించి కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి1, 2024 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సవరించిన అన్ని సదుపాయాలతో ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్‌లో నగదు రహిత ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి కొత్తూరి సంపత్ కుమార్, ఉపాధ్యాయులు క్యాథరిన్, సాల్మన్ రాజు, దస్తగిరి, రమేశ్, ఇంద్రసేనారెడ్డి, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.
తెలుపు నంబర్‌ప్లేట్లతో ట్యాక్సీ మోసం
జనగామ రూరల్: పసుపు నంబర్ ప్లేట్లకు బదులు తెలుపు నంబర్ ప్లేట్లతో ట్యాక్సీ మోసం జరుగుతోందని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం తెలుపు నంబర్ ప్లేట్ల వాడటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ ఆరోపించారు. మంగళవారం పట్టణలోని సంఘం కార్యాలయంలో బూడిద ప్రశాంత్ అద్యక్షతన రవాణా రంగ కార్మికుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..జిల్లాలో తెలుపు నంబర్ ప్లేట్లు కలిగిన సొంత వాహనాల్లో ప్రయాణికులను హైదరాబాద్, సూర్యాపేట, హన్మకొండ, లాంటి పట్టణాలకు ప్రయాణికులను తీసుకెళ్తున్నారని, ప్రమాదాలు జరిగితే బీమా పరిహారం అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. శివరాత్రి రాజు, చీర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
11జెజిఎన్ 154:సమావేశంలో మాట్లాడుతున్న సంచు విజేందర్
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి శక్తిఆయుధం
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి శక్తిఆయుధం


