సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్‌కు వీడ్కోలు
జనగామ రూరల్: సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించిన సి.విక్రమ్ ప్రమోషన్‌లో బదిలీ అయ్యారు. ఏడీజేగా హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ కాగా బార్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దండే బోయిన హరిప్రసాద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా జడ్జి ప్రతిమ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సబ్ కోర్టు జడ్జిగా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా అత్యుత్తమమైన సేవలను అందించారని కొనియాడారు. సమావేశంలో సీనియర్, జూనియర్ కోర్టుల జడ్జిలు సుచరిత, సందీప, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్, మహీధర్‌రావు, పానుగంటి శ్రీనివాస్, ఎ.భిక్షపతి, ఎలగందుల చంద్రఋషి, డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్, ఉప్పలయ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
చిల్పూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ మీట్‌లో నిర్వహించిన 600 మీటర్ల జూనియర్ బాలికల విభాగంలో మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జీడి ప్రీతి మొదటి స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎల్లభట్ల విజయ్‌కుమార్, పీఈటీ దేవ్‌సింగ్ మంగళవారం పేర్కొన్నారు. ఈనెల 14న రంగారెడ్డి జిల్లా జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్‌కు వీడ్కోలు


