అబుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ రూరల్: దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పింకేశ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్‌షాలోమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పి.అనిల్‌బాబు అధ్యక్షుతన ఏర్పాటు చేసి న సమావేశానికి అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ కుమార్ బి.విక్రమ్ కుమార్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె.కుమారస్వామి, జమాల్ షరీఫ్, అజీమ్, అజహారుద్దీన్, అన్వర్, ఏజాజ్ పాల్గొన్నారు.
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయ విద్యా విధానంలో అబుల్ కలాం చేసిన సంస్కరణల కృషిని కొనియాడారు.


