మనుషుల వెంటే పరుగెత్తుతూ..
ప్రతిరోజూ ఉదయం బయటికి వెళ్లాలంటే భయం వేస్తోంది. మా కాలనీలో 50కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు వారి వెనకాలే పరిగెత్తుతూ భయపెడుతున్నాయి. ప్రజల భద్రతను కాపాడేలా పురపాలిక అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
– మల్లిగారి రాజు, 13వార్డు
అధికారులు పట్టించుకోవడం లేదు..
రాత్రివేళ ఇంటికి వెళ్లే సమయంలో కుక్కలు దాడి చేస్తున్నాయి. బైక్ మీద వెళ్తే వెనకే పరుగెత్తుకుంటూ వెంబడిస్తాయి. చాలా మందిని కరిచాయి. ప్రతి వీధి మూలలో పది పన్నెండు కుక్కలు కాచుకుని చూస్తున్నా యి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. – హరికృష్ణ, బాలాజీనగర్
ఎవరైనా భయపడాల్సిందే
రోడ్డుపై వెళ్లే క్రమంలో కుక్కలు పరుగెత్తిస్తున్నాయి. చాలా భ యంగా ఉంది. కొందరు పిల్లలకు గాయాలు అయినా కూడా ఎవ రూ పట్టించుకోవడం లేదు. మా రక్షణ కోసం కనీసం కుక్కలను పట్టుకునే బృందం తరచుగా రావాలి. చిన్నపిల్లలకు ఇది చాలా ప్రమాదకరం – బొమ్మకంటి అనిల్ గౌడ్,
రెడ్డి స్ట్రీట్, జనగామ
యుద్ధం చేయాల్సి వస్తోంది..
నిత్యం ఉదయం ఇంటి బయటకు వస్తుంటేనే పది నుంచి 20 కుక్కలు కనిపిస్తాయి. రోజు కుక్కలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. చెత్త దగ్గరే ఎక్కువగా ఉంటా యి. మున్సిపాలిటీ చెత్త సకాలంలో తొలగిస్తే కొంతవరకు సమస్య తగ్గుతుంది. కుక్కల వల్ల బాటసారులు, వృద్ధులు, పిల్లలు భయంతో ఇబ్బంది పడుతున్నారు. – జాయ శ్రీశైలం, కుర్మవాడ, 20వ వార్డు
●
మనుషుల వెంటే పరుగెత్తుతూ..
మనుషుల వెంటే పరుగెత్తుతూ..
మనుషుల వెంటే పరుగెత్తుతూ..


