జనగామ:స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన (ఐఏఎస్)పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఎన్జీఓ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవసేనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీఒక్కరికి ఉంటుందని, ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేసే క్రమంలో తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలే తప్ప, అధికారులను అకారణంగా నిందించడం సరికాదని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సెక్రటరీ జనరల్ కొర్నేలియస్, జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేర్వారం ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు రాజా నర్సయ్య, కోశాధికారి ఎండీ అఫీజ, సంపత్ కుమార్, రామనర్సయ్య ఉప్పలయ్య, నాగార్జున, విష్ణు, అరుణ తదితరులు ఉన్నారు.
జనగామ రూరల్: జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి యువతకు జీవనోపాధి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. శనివారం పాము శ్రీకాంత్ అధ్యక్షతన పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి లేక హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, జిల్లా కేంద్రంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జోగు ప్రకాష్, బూడిద గోపి, బాల్నే వెంకట మల్లయ్య, కల్యాణం లింగం, బొట్ల శ్రావణ్, మంగ బీరయ్య, పందిళ్ల కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
‘కపాస్ కిసాన్’ యాప్‌ను అమలు చేయొద్దు’
జఫర్‌గఢ్: పత్తి కొనుగోలులో అమలు చేస్తున్న కాపాస్ కిసాన్ యాప్ విధానాన్ని అమలు చేయొద్దని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ యాప్ విధానంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైన స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయాడాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతీ ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఎకరాకు రూ.475 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాయపురం భిక్షపతి, నక్క యాకయ్య, పెద్ద రాములు, యాతం సమ్మయ్య తదితరులు ఉన్నారు.
సీఐటీయూ
జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా 4వ మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ, రాష్ట్ర కార్యదర్శులు పుప్పాల శ్రీకాంత్, బి. మధు, యాటల సోమన్న ఆధ్వర్యంలో జిల్లా కమిటీ, ఆఫీస్ బేరర్స్ ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా రాపర్తి రాజు, సుంచు విజేందర్, కోశాధికారిగా అన్నెబోయిన రాజు, ఉపాధ్యక్షులుగా చిట్యాల సోమన్న, కోడెపాక యాకయ్య, పొదల నాగరాజు, సహాయ కార్యదర్శులుగా బస్వ రామచంద్రం, బూడిద ప్రశాంత్, అంజుమ్‌లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని అధ్యక్షకార్యదర్శులు పేర్కొన్నారు.
‘అనుచిత వ్యాఖ్యలు సరికాదు’
‘అనుచిత వ్యాఖ్యలు సరికాదు’


