సీతారాముల కల్యాణం చూతము రారండి
ముస్తాబైన జీడికల్ ఆలయం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయం సీతారా ముల కల్యాణోత్సవానికి ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం, కల్యాణ వేదిక, చలువ పందిళ్లు, విద్యుత్ వెలుగులతో విరాల్లుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వివాహతంతు గరుడముద్ద (పెళ్లికి దేవతలను ఆహ్వానించే వేడుక) నేడు (ఆదివారం) ప్రారంభం కానుంది. రాత్రి సీతమ్మవారిని తీసుకొచ్చే ఎదుర్కోలు తంతును పూర్తి చేసి ఈ నెల 10న కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా జీడికల్‌లో ప్రతీ ఇంటిలో రాముడి పేరుతో ఇంట్లో ఒకరి పేరు పెట్టుకోవడం భక్తుల కోర్కెలు తీర్చే వీరాచల రామచంద్రస్వామికి నిదర్శనం. శ్రీరామ నవమితో పాటు కార్తీక మాసంలో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడి విశేషం.
ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో..
సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో పర్ణశాలలో సీతాదేవి కుటీరంలో ఉండగా మారీచుడు బంగారు లేడి రూపంలో ఆమె కంటపడుతుంది. ఆ బంగారు లేడి కావాలని సీత రాముడిని కోరగా వెంబడించుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మాయలేడి సంహారం చేసి మారీచుడికి పాప విముక్తి కలిగించాడని..అదే లేడిబండగా పేరు గాంచింది.
విద్యుత్ వెలుగులతో
విరాజిల్లుతున్న
జీడికల్ ఆలయం
నేడు గరుడముద్ద.. ఎదుర్కోలు
రేపు సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం చూతము రారండి


