మార్కెట్ అభివృద్ధికి కృషి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శనివా రం మార్కెట్ కార్యాలయ చాంబర్‌లో పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మా ట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మార్కెట్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మార్కెట్ యా ర్డులో నూతన 5వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మా ణం, సోలార్ లైటింగ్‌తో పాటు లింగాలఘణ పూర్, రఘునాథపల్లి మండలాల్లోని 5వేల మెట్రిక్ టన్ను ల నాబార్డ్ గోదాములకు రోడ్డు నిర్మాణం చే పట్టనున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆయా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. మార్కెట్ యార్డులో పని చేస్తున్న కార్మికుల సౌకర్యార్థం నూ తన భవన నిర్మాణం చేపట్టాలని సంఘ నాయకులు చైర్మన్‌కు వినతి చేశారు. ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఏఎంసీ చైర్మన్ శివరాజ్‌యాదవ్


