జోనల్ స్పోర్ట్ ్స మీట్‌లో ప్రతిభ
పాలకుర్తి టౌన్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు కొనసాగిన జోనల్ స్థాయి క్రీడాపోటీల్లో పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అండర్ 14 విభాగంలో పాలకుర్తి 30 పాయింట్లు, అండర్ 17 విభాగంలో జఫర్‌గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల 30 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగత చాంపియన్‌గా అండర్ 14 విభాగంలో నాగ పూజిత విజేతగా నిలిచారు. మూడు విభాగాల్లో అఽత్యధిక పాయింట్లు సాధించి జోనల్ స్థాయి చాంపియన్‌గా పాలకుర్తి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నిలిచారు. ఈ మేరకు శనివారం రాత్రి ముగింపు వేడుకల్లో నల్లగొండ డీసీఓ శోభారాణి చేతులమీదుగా ట్రోఫీ అందుకున్నారు. జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ స్వరూప అభినందించారు.


