సమాజ సేవలో ఎన్‌ఎస్‌ఎస్ భాగం కావాలి
చిల్పూరు: సమాజ సేవలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు భాగం కావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని రాజవరం గ్రామ సమీపంలోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో ఎస్‌ఓ ప్రశాంతి అధ్యతక్షణ ఏర్పాటు చేసిన ఏడు రోజుల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులు మీసేవ సెంటర్లను సందర్శించి కులం, ఆదాయం తదితర సర్టిఫికెట్లు ఎలా దరఖాస్తు చేయాలో నేర్చుకోవాలని, మన విద్యాసంస్థల పరిశుభ్రత సమాజ సేవకు ముందుడేలా పనిచేయడం, ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడం, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, జీసీడీ గౌసియాబేగం, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ దాసరి గోవర్ధన్, అట్ల రాజు, దివ్య, కార్యదర్శి తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి
పింకేష్‌కుమార్


