నాణ్యమైన భోజనం అందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. శుక్రవారం ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యా హ్న భోజన నిర్వాహకులు, హెచ్‌ఎంతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. వంట సామగ్రి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం సంపత్ తదితరులు ఉన్నారు.


