రూ.కోటిన్నర వృథా..?
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో రూ.1.50 కోట్ల వ్యయంతో 10 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ ప్యాడీ డ్రయర్‌ను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం పని చేసే సమయంలో గంటకు 11 లీటర్ల డీజిల్ ఖర్చు చేయడంతో పాటు కరెంటు సైతం ఉపయోగించాలి. రిబ్బన్ కటింగ్ చేశారే తప్ప.. ఒక్కసారిగా కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు అదే అనుభవం మళ్లీ పునరావృతం కాకూడదని రైతులు కోరుకుంటున్నారు. గతంలో మెయింటనెన్స్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో నాటి మార్కెట్ కమిటీ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మినీ ప్యాడీ డ్రయర్‌కు అదే పరిస్థితి రాకూడదనే ఆందోళన వ్యక్తమవుతోంది.


