సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

Nov 8 2025 7:14 AM | Updated on Nov 8 2025 7:14 AM

సత్తయ

సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ మేడారానికి చేరుకున్న సాలహారం స్టోన్స్‌

జనగామ: జిల్లా కురుమ సంఘం, ఒగ్గు బీర్ల సంఘం ఆధ్వర్యంలో ఒగ్గుకళా సామ్రాట్‌, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్‌ చుక్క సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం పట్టణంలోని కళ్లెం రోడ్డు కమాన్‌ సమీపంలో భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 9న చుక్కా సత్తయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణకు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు, సంపత్‌, జాయ మల్లేష్‌, బాల్దె మల్లేశం, జూకంటి శ్రీశైలం, కడకంచి మధు, ఎండ్రు వైకుంఠం, కేమిడి ఉపేందర్‌, చంద్రమౌళి, వీరస్వామి, జంగిడి సిద్దులు, రోషయ్య, సత్తయ్య, ప్రవీణ్‌, ఆంజనేయులు, అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

నేడు చెక్క బొమ్మలాట కళారూపాల ప్రదర్శన

జనగామ: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేడు (శనివారం) నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన అపురూపమైన చెక్క బొమ్మలాట, యక్షగానం కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌, పరిశోధకులు జయధీర్‌ తిరుమలరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ గూడూరు మనోజ, శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ మెట్టు వెంకటనారాయణ తదితరులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జి బదిలీ

జనగామ రూరల్‌: జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సి. విక్రమ్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆఫ్‌ తెలంగాణ జరరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మేడ్చల్‌ మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టుకు అడిషనల్‌ జడ్జిగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. జిల్లాలో పౌరసేవలు, సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం

లింగాలఘణపురం: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సుజాత అన్నారు. శుక్రవారం మండలంలోని వనపర్తిలో ఉచిత కుట్టు శిక్షణ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడం కోసం నిరంతరం సేవ చేసేందుకు సంస్థ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సేలేంద్ర కుమార్‌, స్టేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పప్పుల సుధాకర్‌, స్టేట్‌ మేనేజర్‌ మాధవి ఆధ్వర్యంలో జిల్లాలో కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కుట్టు శిక్షణ అనంతరం సబ్సిడీపై కుట్టు మిషన్లు, భవిష్యత్‌లో కంప్యూటర్‌ ట్రైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం డిజైనింగ్‌ తదితర శిక్షణ కార్యక్రమాలు చేపడుతామని సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్‌చార్జ్‌ సంధ్య, మహిళలు పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల గద్దెల ప్రాంగణం సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులు సాగుతున్నాయి. రాతి కట్ట డాలతో సాలహారం నిర్మించనున్నారు. ప్రస్తుతం సాలహారం నిర్మాణానికి పిలర్లపై బీమ్‌లను నిర్మిస్తున్నారు. 90 రోజుల్లో ప్రహరీ నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం మేరకు సంబంధిత కాంట్రాక్టర్లు ఆదిశగా పనులు చేపడుతున్నారు. నేటి నుంచి బీమ్‌లపై రాళ్లను(స్టోన్స్‌) ఏర్పాటు చేసేందుకు లారీల్లో మేడారానికి తీసుకొచ్చారు. గుంటూ రు, ఒంగోలు, నంద్యాల ప్రాంతాల్లో సాలహా రం నిర్మాణం రాళ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికా రులు తెలిపారు. నేటి నుంచి స్టోన్స్‌ ఏర్పాట్ల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

సత్తయ్య విగ్రహ  ప్రతిష్ఠాపనకు భూమిపూజ
1
1/2

సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

సత్తయ్య విగ్రహ  ప్రతిష్ఠాపనకు భూమిపూజ
2
2/2

సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement