మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలోని రిజర్వాయర్‌లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ మత్స్యసొసైటీ చైర్మన్ నీల సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చేపలను పెంచడంతో పాటు మార్కెటింగ్, రవాణా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీఎఫ్‌ఓ రాణాప్రతాప్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్ట య్య, ఘన్‌పూర్ సొసైటీ అధ్యక్షుడు నీల సోమన్న, డైరెక్టర్లు గోనెల ఐలోని, మునిగెల ఐలోని, నీల సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.
పంపుహౌస్ పనుల పరిశీలన
చిల్పూరు/నర్మెట: మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధిలోని గండి రామారం పంపుహౌస్‌ను శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి ఎత్తిపోతల పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడే పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం లభించనుందనన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తి చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్‌లో ముదిరాజ్‌లతో కలిసి చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఎడవెళ్లి మల్లారెడ్డి, నీల రాజు, రంగు రమేశ్, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు, పేరాల సుధాకర్ తదితరులు ఉన్నారు. అలాగే నర్మెట మండలంలో దేవాదుల ఫేస్ 2 పనుల్లో భాగంగా మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి మండలంలోని బొత్తలపర్రె మిని రిజర్వాయర్ వరకు చేపట్టిన పైపులైన్ పనులను నర్సాపూర్ శివారులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు.


