పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: ఐక్య పోరాటాలతోనే కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీఐటీయూ జిల్లా 4వ మహాసభల ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆవిష్కరించారు. అనంతరం బొట్ల శ్రీనివాస్ చిత్రపటానికి యూనియన్ రాష్ట్ర, జిల్లా నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది మంది శ్రామికులు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడులను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బి.మధు, పి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కోడిపాక యాకయ్య, బి.అంజుమ్, సింగారపు రమేశ్, భూక్య చందు, అన్నేబోయిన రాజు, చిట్యాల సోమన్న, పొదల నాగరాజు, బస్వ రామచంద్రం, ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ


