అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దు
● కలెక్టర్ రిజ్వాన్‌బాషా
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం మాయిశ్చర్ పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో కేంద్రాల్లో నిర్లక్ష్యం వహించకుండా ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ధాన్యం తడువకుండా రైతులకు టార్పాలిన్‌లు ఇచ్చి సహకరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ తదితరులు ఉన్నారు.


