బాల్యవివాహాలు.. తగ్గుముఖం
న్యూస్‌రీల్
తగ్గుదలకు కారణాలు:
శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ఐదేళ్లుగా
తగ్గుతున్న కేసులు
● అధికారుల
నిరంతర పర్యవేక్షణ
● కఠిన చర్యలపై
గ్రామాల్లో అవగాహన
జనగామ రూరల్: జిల్లాలో బాల్యవివాహాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఐసీపీఎస్(సమీకృత బాలల సంరక్షణ పథకం) అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మారుమూల ప్రాంతాల్లో సైతం గ్రామ పెద్దలకు, ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. చదువుకోవాల్సిన పిల్లలకు పెళ్లిళ్లు చేసి బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా కాకుండా బాలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఉన్నత శిఖరాలకు చేరేలా తల్లిదండ్రులు కృషి చేయాలని అధికారులు సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యం చేస్తున్నారు. తమ పిల్లలు ప్రేమ వివాహాల వైపు ఎక్కడ ఆకర్షితులవుతారోనని కొందరు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక తొందరగా వివాహం చేసి బరువు దించుకోవాలని భావనలో మరికొందరు తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి వారికి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అధికారులు నిత్యం విడమరిచి చెబుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో కేసులు గణనీయంగా తగ్గాయి. 2021లో 47, ఈ ఏడాది 29 బాల్యవివాహాలను అడ్డుకున్నారు. ఇందులో స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేటలో 4 బాల్య వివాహాల చొప్పున నిలుపుదల చేశారు. గతంలో వివాహాలు చేసిన నలుగురిపై కేసులు నమోదు చేశారు.
బాల్య వివాహం చేస్తే కఠినశిక్ష..
బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసేవారు కఠిన కారాగార శిక్షకు గురవుతారని అధికారులు చెబుతున్నారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేసిన తర్వాత మైనర్‌ను అక్రమ రవాణా చేయడం, దాచేయడానికి ప్రయత్నించడం చట్టరిత్యా నేరం. బాల్య వివాహాలు నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అలాగే చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా పోలీసులు బాల్య వివాహాలు నిలిపివేయవచ్చు. ఈచట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధిస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలనే నిబంధన భారత చట్టంలో ఉంది. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్య సమస్యలు, శిశు మరణాలు, గర్భస్రావం, రక్తపోటు, పోషకాహార లోపం, రక్తహీనత తదితర ఇబ్బందులు ఎదురవుతాయి.
జిల్లాలో తండాలు, పాఠశాలలు, మారుమూల పల్లెలకు సైతం ఐసీపీఎస్ అధ్వర్యంలో వెళ్లి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. బాల్య వివాహాలపై ప్రదర్శనలు చేసి గ్రామంలో సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలు తెలియజేస్తున్నాం. దీంతో ప్రజల్లో చైతన్యం కలుగుతోంది.
– లకుట్ల రవికాంత్, జిల్లా ఐసీపీఎస్ అధికారి
బాల్య వివాహం జరగుతుందని తెలిస్తే వెంటనే నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– కోదండరాం, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి
●
గ్రామాల్లో పేదలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం
ప్రభుత్వ పథకాలు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధికోసం..
బాలికలు తమ హక్కులను వినియోగించుకోవడంలో వెనకబడిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని బాల్యవివాహాల నిర్మూలన, బడిబయటి పిల్లలను పాఠశాలలో చేర్పించి అక్షరాస్యులుగా చేయడం
కమిటీలు, స్వచ్ఛంద సంస్థల కృషి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం
బాల్యవివాహాలు చేసిన వ్యక్తులపై కేసులు, కఠిన చర్యలు
బాల్యవివాహాలు.. తగ్గుముఖం
బాల్యవివాహాలు.. తగ్గుముఖం
బాల్యవివాహాలు.. తగ్గుముఖం
బాల్యవివాహాలు.. తగ్గుముఖం


