ఉల్లాసంగా ఉత్కర్ష
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉత్కర్ష వేడుకలు రెండో రోజూ సోమవారం ఉల్లాసంగా కొనసాగాయి. ఉదయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 40 మంది వైద్యవిద్యార్థులు రక్తదానం చేశారు. రాత్రి నిర్వహించిన కార్నివాల్ నైట్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్‌తో కళాశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. విద్యార్థులు కాస్‌ప్లేలో భాగంగా సినీపాత్రలు, కార్టూన్ పాత్రలు, విభిన్న వేషధారణలతో సందడి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, మురళీ, పుల్లయ్య పాల్గొన్నారు.
ఉల్లాసంగా ఉత్కర్ష


