శివాలయాల్లో కార్తీక కాంతులు
జనగామ: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోని మొదటి సోమవారం పురస్కరించుకుని తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయయాలకు భారీగా తరలివచ్చారు. ఓం నమఃశివాయ నినాదాలతో ఆలయాలు మార్మోగాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
శ్రీసోమేశ్వరాలయంలో..
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రదాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న,అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శివాలయాల్లో కార్తీక కాంతులు
శివాలయాల్లో కార్తీక కాంతులు
శివాలయాల్లో కార్తీక కాంతులు


