ఆద్యంతం.. ఉత్కంఠ
కొందరికే సంతోషం.. ఎక్కువ మందికి నిరాశే
జనగామ: కలెక్టర్ వేదికపై ఆసీనులయ్యారు.. ఎదురుగా టెండరుదారులు. ఓ టబ్బులో లాటరీ బిల్లలను వరుస క్రమంలో పేర్చారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారి నెంబర్‌తో ఉన్న బిల్లలను డబ్బాలో వేసి అటూ ఇటూ తిప్పారు. తదుపరి క్షణం హాల్ అంతా ఉత్కంఠతో నిండిపోయింది. కలెక్టర్ డబ్బాలో చేతిని పెట్టి.. ఓ బిల్లను తీశారు. ‘ఇదిగో అదృష్టం ఎవరిదో..’ అంటూ నెంబర్ చెప్పడంతో లక్కీ భాస్కర్ ఎగిరి గంతు వేయగా..మిగతా టెండరుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ సోమవారం ఉత్కంఠభరిత వాతావరణంలో విజయవంతంగా పూర్తిచేశారు.
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు నందన గార్డెన్స్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని లాటరీ ద్వారా షాపుల కేటాయింపులు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఎకై ్సజ్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ లాటరీ తీశారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 50 మద్యం షాపుల కోసం 1,697 టెండర్లు దాఖలయ్యాయి. లాటరీని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు వీడియో రికార్డింగ్‌తో పాటు సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు.
కొత్తవారికి అదృష్టం... పాతవారికి నిరాశ
జిల్లాలోని మూడు ప్రధాన గ్రూపులకు సంబంధించి 70 నుంచి 300 వరకు టెండర్లు వేయగా, కొత్తగా రంగంలోకి దిగినవారు మాత్రం 10 నుంచి 20 మందిగా గ్రూపులుగా ఏర్పడి 30 నుంచి 75 వరకు దరఖాస్తులు వేశారు. వీరిలో చాలా మందికి అదృష్టం కలసి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో టెండర్ వేసి ఫలితం దక్కని పాత వ్యాపారులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది.
చిన్న పెండ్యాల వైన్స్‌కు భారీ పోటీ
చిన్న పెండ్యాల వైన్‌న్స్ (షాపు నెంబర్–21)కు రికార్డు స్థాయిలో 108 టెండర్లు రాగా.. ఒక్క దరఖాస్తు మాత్రమే ఎంపిక కావడంతో 107 మంది నిరాశ చెందారు. సాయికృష్ణారెడ్డి(లాటరీనెంబర్–29)కి అదృష్టం కలిసి వచ్చింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో టెండర్లు వేసిన వారు ఫలితాలు తేలగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. కొందరు కన్నీళ్లతో వెళ్లిపోవడం గమనార్హం.
ఆనందోత్సాహాలు..
ఇదే సమయంలో కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన కొందరికీ అదృష్టం కలసి వచ్చింది. బచ్చన్నపేటకు చెందిన నల్లం వంశీ టీం రెండు టెండర్లు వేయగా, మొదటి ప్రయత్నంలోనే జనగామ షాప్–1 దక్కింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లక్కీగా అవగాశం వచ్చిన వారి ఆనందోత్సాహాలతో నందన గార్డెన్స్ ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది.
చిన్నపెండ్యాల వైన్స్‌కు అత్యధికంగా 108 టెండర్లు, ఉత్కంఠతో ఎదురుచూపులు
చిన్నపెండ్యాల షాపునకు భారీ పోటీ.. అందరి దృష్టి ఈ షాపుపైనే..
నందన గార్డెన్స్ వేదికగా కలెక్టర్ సమక్షంలో లాటరీ
వీడియో పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు
50 వైన్స్‌లు...1,689 దరఖాస్తులు
లాటరీ సమయంలో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ అదృష్టం వరిస్తుందోనన్న ఆతృత అందరిలో కనిపించింది. కలెక్టర్ స్వయంగా డబ్బా తిప్పి నెంబర్లను తీసి ఫలితాలు ప్రకటించారు. ఒకవైపు విజేతల ముఖాల్లో ఆనందం పూస్తే, మరోవైపు లాటరీ రాని వారి కళ్లలో నిరాశ కనిపించింది. ఎటువంటి అవా ఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆద్యంతం.. ఉత్కంఠ
ఆద్యంతం.. ఉత్కంఠ


