మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత మార్కెట్‌లో కొత్త కదలికలు మొదలయ్యాయి. లాటరీలో అవకాశం దక్కని బడా వ్యాపారులు లక్కీ భాస్కర్లపై దృష్టి సారిస్తున్నారు. షాపులు దక్కిన కొత్తవారిని సంప్రదిస్తూ కొనుగోలు చర్చలు మొదలుపెట్టారు. మద్యం దుకాణాలు అమ్ముకునేందుకు ముందుకు వచ్చేవారు రూ.60 లక్షల నుంచి రూ.కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. భారీ డిమాండ్ ఉన్న చోట రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. లాటరీలో అవకాశం రాని పలువురు బడా వ్యాపారులు.. మధ్యవర్తుల సహకారంతో కొత్తవారి నుంచి వైన్స్‌ల కొనుగోలుకు చర్చలు ప్రారంభించారు. మధ్యవర్తులు ఇరువురిని ఒప్పించి డీల్ కుదిరేలా బేరసారాలు నడిపించి.. ఎంతో కొంత కమీషన్ పుచ్చుకుంటున్నట్లు సమాచారం.
బడా వ్యాపారుల రీఎంట్రీకి ప్రయత్నాలు


