హైవేపై వ్యాపారం..జరభద్రం
వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారి జనగామ మండలం పెంబర్తి జంక్షన్ వద్ద రోడ్డుపైనే సీతాఫలాలు అమ్ముతున్నారు. వరంగల్, హైదరాబాద్ వెళ్లే వాహన చోదకులు సీతాఫలాలను కొనుగోలు చేసేందుకు కార్లను రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు. వేగంగా దూసుకొచ్చే వాహనాలతో ఏదైనా ప్రమాదం జరిగితే..బాధ్యత ఎవరిదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌హెచ్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో ప్రమాదం అంచున సీతాఫల్ వ్యాపారం జరుగుతోంది. గతంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లపైకి భారీ వాహనాలు దూసుకొచ్చి అమాయకులు చనిపోయిన సంగతి తెలిసిందే. – జనగామ


