సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు అర్చకులు తాంబూలం, ప్రసాదం వాయినంగా అందజేశారు. ఆలయంలో ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.
జనగామ: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేడు (గురువారం) ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు జరగాల్సిన సమ్మెటివ్ పరీక్షలను వచ్చే నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 3 నుంచి 5వ తరగతులకు ఈవీఎస్, 6, 7వ తరగతుల జనరల్ సైన్స్, 8, 9, 10వ తరగతుల సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నవంబర్ 1న నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 31 వరకు ముందుగా విడుదల చేసిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నిర్వహించబడతాయన్నారు. కాగా రెసిడెన్షియల్ సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మాత్రం సెలవు వర్తించదని, వారు విద్యార్థుల భద్రతతో పాటు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.
జనగామ రూరల్: జనగామ డీపీఓగా అంగరాజు నవీన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన నవీన్ ఇటీవల గ్రూప్ – 1 అధికారిగా నియామకమయ్యారు. కాగా సీనియర్ అసిస్టెంట్ ఎస్. శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
జనగామ రూరల్: జనగామలో శాతవాహన రైలు హాల్టింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కృషి చేశారని జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రాంత ప్రజల ప్రయాణం కోసం శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్ వద్ద నిలుపుదల చేయడం అభినందనీయమన్నారు. నేటి నుంచి జనగామలో శాతవామాన నిలుపుదల ఉంటుందన్నారు. ఈసందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జి ల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, అంజిరెడ్డి, భాగాల నవీన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడైన తెగిన విద్యుత్ తీగలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జనగామ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి.వేణు మాధవ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ భద్రత కోసం ప్రజలు తప్పనిసరిగా సూచ నలను పాటించాలన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో తడిగా ఉన్న చేతులతో స్విచ్‌లు, మీటర్లు, ప్లగ్‌లు, వైర్లు తాకరాదన్నారు. గాలులతో తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించిన వెంటనే సమీప లైన్‌మన్‌కు, లేదా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల సమయంలో సూచనలను పాటించడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం


