రోడ్ల అభివృద్ధికి రూ.120కోట్ల నిధులు మంజూరు
జఫర్‌గఢ్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 120 కోట్ల 40లక్షల నిధుల మంజూరయ్యాయని సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ..ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు జఫర్‌గఢ్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేయడమే కాదు కొత్తగా రోడ్ల అభివృద్ధికి రూ.120 కోట్ల 40 లక్షల నిధులను మంజూరు చేయించారన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బానోత్ రాజేష్‌నాయక్, కుల్లా మోహన్‌రావు, చిట్టిమళ్ల కృష్ణమూర్తి, ఎడ్ల వెంకటస్వామి, మారపల్లి ప్రభాకర్, జ్యోతి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


