ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జనగామ: ఆసియా ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని సెయింట్‌పాల్స్ హైస్కూల్‌లో ఆదివారం రక్తదా న శిబిరం నిర్వహించారు. ఎస్‌ఆర్ బ్లడ్ బ్యాంకు సెంటర్ ఆధ్వర్యంలో డెంగీ, తలసేమియా బాధితుల రక్త అవసరాలను తీర్చేందుకు ఫౌండేషన్ అధ్యక్షుడు మొహినొద్దీన్ సభ్యులు ఈశ్వర్, శివ, తౌఫిర్, షాహిద్, మెషిన్, శృతి, మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని డాక్టర్ సుగుణాకర్‌రాజు ప్రారంభించారు. రక్తదానం చేసిన 70మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
కరాటే విజేతకు కేయూ రిజిస్ట్రార్ అభినందనలు
జనగామ: గోవాలో ఇటీవల జరిగిన జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా 17జేకేఏ జాతీయస్థాయి పోటీల్లో బచ్చన్నపేట మండలం రామచంద్రాపురానికి చెందిన విద్యార్థి అన్వేష్ ప్రతిభ చాటారు. ఈమేరకు కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం అన్వేష్‌ను వర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ వి.రాంచంద్రం, రాజనీతిశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, అధ్యాపకులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నాగరాజ్, పీహెచ్‌డీ స్కాలర్ కె.ప్రశాంత్ అభినందించారు. మాస్టర్ పులిగిల్ల సుకేష్ సమక్షంలో విద్యార్థికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కాగా జనగామకు చెందిన మరో ఆరుగురు విద్యార్థులు ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
త్రికూటాలయంలో
హెరిటేజ్‌వాక్ బృందం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ త్రికూటాలయాన్ని ఆదివారం హైదరాబాద్ హెరిటేజ్‌వాక్ బృందం సందర్శించింది. త్రికూటాలయం చరిత్ర నేపథ్యం, పునఃనిర్మాణం అడ్డంకుల గురించి వేద పండితులు కృష్ణమాచార్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలోని త్రికూటాలయం, శివాలయంలోని చారిత్రక శిల్పాలు వాటి ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నామన్నారు. పెంబర్తి హస్తకళల కేంద్రాన్ని సందర్శించి వర్క్‌షాపు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చారిత్రాత్మక సంపద భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని బృందం సభ్యులు పేర్కొన్నారు.
గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
స్టేషన్‌ఘన్‌పూర్: కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో కేజీకేఎస్ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం సంఘం మండల గౌరవ అధ్యక్షుడు గట్టు రమేశ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణ మాట్లాడారు.. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఆరోపించారు. ఎక్స్‌గ్రేషియా బాధితులే స్వయంగా కలెక్టరేట్‌ల ఎదుట నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదన్నారు. కల్లుగీత కార్మికులకు వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు మృతిచెందినా, గాయపడినా అందించే ఎక్స్‌గ్రేషియా, పరిహారం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందన్నారు. సాఫ్ట్ డ్రింక్‌లు తయారు చేసే బడా కార్పొరేట్ కంపెనీలు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో కేజీకేఎస్‌రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య, నాగన్న, జిల్లా కమిటీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.
ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


