సర్దుబాటుకు సై
జిల్లాలో సర్దుబాటు టీచర్ల సమాచారం
జనగామ: జిల్లాలో అటకెక్కిన టీచర్ల సర్దుబాటు ఎట్టకేలకు స్కూల్‌కు చేరింది. రెండు నెలలుగా కాలయాపన చేస్తూ ...ఎస్‌ఏ–1 పరీక్షలు మొదలయ్యాక సర్దుబాటుకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. సర్దుబాటు జాప్యంపై సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలతో విద్యాశాఖలో అలజడి మొదలైంది. మొదటి సర్దుబాటులో పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు సాక్షి కథనంతో వెలుగులోకి రావడంతో దానికి బ్రేక్ వేశారు. రెండోసారి సర్దుబాటు చేస్తూ ఉన్నతాధికారుల సంతకం లేకుండా డ్రాఫ్ట్ పేరిట లీకులు ఇచ్చి..ఇందు లో తప్పులేమైనా ఉన్నాయా అని ఒకటికి, రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లు గుర్తించిన పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సర్దుబాటు సమస్య విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారడంతో.. విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రభుత్వ బడుల్లో బోధనకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో సాక్షి ఇటీవల శ్రీఅటకెక్కిన సర్దుబాటుశ్రీ శీర్షికన ప్రచురితం చేసిన కథనం విద్యాశాఖను కుదిపివేయడంతో.. 94 మందితో కూడిన టీచర్ల జాబితాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు.
ఆలస్యంతో విద్యార్థుల ఇబ్బందులు
టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీన పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలతో రెండు నెలల పాటు కాలయాపన చేశారు. ఈ సమయంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు కారణంగా తరగతుల్లో బోధనకు అంతరాయం కలిగింది. దీంతో అక్కడక్కడా తల్లిందడ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు సైతం దిగారు. ఎట్టకేలకు సర్దుబాటు ముగియడంతో నేటి నుంచి టీచర్లపై ఒత్తిడి తగ్గనుంది.
కేటగిరీ సర్దుబాటు టీచర్లు
స్కూల్ అసిస్టెంట్ (సోషల్) 07
స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 03
స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్) 04
స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) 03
స్కూల్ అసిస్టెంట్ (గణితం) 02
స్కూల్ అసిస్టెంట్ (హిందీ) 01
లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) 03
లాంగ్వేజ్ పండిట్ (హిందీ) 01
ఎస్జీటీ 70
94 మంది ఉపాధ్యాయుల జాబితాతో కలెక్టర్ ఉత్తర్వులు
సర్దుబాటుకు సై


