‘లక్కీ’ భాస్కర్లు ఎవరో?
జనగామ: మద్యం దుకాణాల కేటాయింపులపై వ్యాపారుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. ఈనెల 27న(సోమవారం) జరుగనున్న లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిదో తేలిపోనుంది. పాత వ్యాపారులు, కొత్త ఆశావహులు ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. గతంలో చేజారిన లైసెన్స్‌లను తిరిగి పొందాలని లెక్కల్లో మునిగితేలుతుండగా, మరికొంత మంది దేవుళ్ల దయ కోసం ఆలయాల బాటపట్టారు. మరి కొద్దిసేపట్లో మొదలు కానున్న లక్కీ లాటరీలో తమ పేరు వినిపిస్తుందేమోనన్న ఆశతో డ్రాలో ‘లక్కీ’ తగలాలని ఆలయాల్లో ముడుపులు కట్టారు. 2025–27 సంవత్సరానికి గాను వైన్స్‌లను దక్కించుకునేందుకు ఒక్కొక్కరు ఒకటి నుంచి 300(టీంలుగా ఏర్పడి) వరకు దరఖాస్తులు వేయగా, సుమారు ఆరు నుంచి 10 సిండికేట్ గ్రూపులు ఏర్పడ్డాయి. జిల్లాలోని 50 మద్యం దుకాణాల కోసం 1,697దరఖాస్తులు వచ్చాయి.
ఏర్పాట్లు పూర్తి..
జనగామ మండలం పెంబర్తి జంక్షన్‌లోని నందన గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల కేటాయింపులకు లక్కీ లాటరీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. టెండరుదారులు ఉదయం 9 గంట ల వరకే నందన గార్డెన్‌కు రావాలని అధికారులు తెలిపారు. టెండరు రశీదుతో పాటు ఎంట్రీ పాస్, గుర్తింపు పొందిన కార్డును వెంటతెచ్చుకోవాని సూచించారు. లాటరీ నిర్వహించే వేదిక వద్దకు సెల్‌ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆధ్వర్యంలో టెండర్ దారుల సమక్షంలో డ్రా తీయనున్నారు.
నేటి మద్యం షాపుల లాటరీలో దశ తిరిగేదెవరికో!
అదృష్టం వరించాలని వ్యాపారుల
ఆలయాల బాట
50 వైన్స్‌లు...1,697 దరఖాస్తులకు డ్రా
నందనా గార్డెన్‌లో ఏర్పాట్లు పూర్తి


