తెరుచుకునే దారేది?
సగం పూర్తయినా ప్రారంభం కాని రోడ్డు
జనగామ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు జ్యోతినగర్ ప్రధాన రహదారిపై భారీ నాలా నిర్మాణం చేస్తున్నారు. నాలా నిర్మాణ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దారిని మూసివేశారు. దీంతో దారిలో ఉన్న వ్యాపార సముదాయాలు మూసేసుకునే పరిస్థితి ఎదురవుతోంది. రోడ్డు మధ్యలో నిర్మాణం సగం వరకు పూర్తయినప్పటికీ, మూసుకున్న దారి తెరుచుకోవడం లేదు. దీంతో కాలనీ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యాపారాలు చేసుకునేవారు నష్టంతో అప్పుల పాలవుతున్నారు. నాలా ఎక్కడి వరకు... ఎక్కడ పుల్‌స్టాప్.. అసలు ఏ ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారని ప్రజలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. – జనగామ


