నాణ్యమైన భోజనం అందించాలి
జనగామ: రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని టాస్క్‌ఫోర్స్ టీం అధికారి బి.ప్రేమ్‌కుమార్ అన్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ బృందం జిల్లా ఆస్పత్రితో పాటు అర్బన్ పీహెచ్‌సీ, సెంట్రల్ మెడిసిన్ స్టోర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి పీహెచ్‌సీల్లో తనిఖీలు చేశారు. డయాలసిస్ సెంటర్, వంట గది, సిటీస్కాన్ తదితర సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది పనితీరు, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంతో సమీక్షించారు. మందులు, భోజనం వడ్డింపు, ఫైర్ సేఫ్టీ తదితర సేవలపై చర్చించారు. భోజన వడ్డింపుల్లో అలసత్వం వహించరాదన్నారు. ఈ తనిఖీల్లో డాక్టర్ సయ్యద్ అహ్మద్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వినీల్, పూర్వ ఉమ్మడి జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్ ఉప్పు భాస్కరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లగిశెట్టి అశోక్ కుమార్, డాక్టర్ కమల్, ఫార్మసీ అధికారులు మల్లేశ్వరి, రాజేందర్ తదితరులు ఉన్నారు.
మందుల కొరత రాకుండా చూడాలి
ఆస్పత్రుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు


