మద్యం షాపులకు దరఖాస్తులు 1695
జనగామ: జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి ముగి సింది. మొత్తం 50 మద్యం దుకాణాలకు గాను 1,695 దరఖాస్తులు రాగా, చివరిరోజే 91 టెండర్లు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో జనగామ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 583, పాలకుర్తి సర్కిల్‌లో 558, స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్‌లో 554 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జనగామ మున్సిపల్ పరిధిలోని షాప్ నెంబర్–1కు 6 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం.
చిన్న పెండ్యాల షాపునకు 108..
చిల్పూరు మండలం చిన్నపెండ్యాల దుకాణాని(షాప్ నెంబర్–21)కి 108 దరఖాస్తులు రావడం విశేషం. 202 3–25 రెండేళ్లకు గాను 2,492 దరఖాస్తులు రాగా, రూ.50కోట్ల మేర నాన్ రిఫండబుల్ ఎకై ్సజ్ ఫీజు వచ్చింది. ఈసారి ప్రభుత్వం ఫీజును రూ.3 లక్షలకు పెంచగా 797 దరఖాస్తులు తగ్గాయి. అయినప్పటికీ ఒక్కో టెండర్ కు మూడు లక్షలకు పెంచడంతో టెండర్లు తగ్గినా రూ.50.85 కోట్ల ఆదాయం వచ్చింది. అయినప్పటికీ టెండర్ల ప్రక్రియ ఎకై ్సజ్ అధికారులను కొంతమేర నిరాశపరిచింది. జిల్లాలోని మద్యం షాపుల కేటాయింపునకు గాను ఈ నెల 27వ తేదీన పెంబర్తి శివారులోని నందన గార్డెన్‌లో లక్కీ లాటరీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
చివరి రోజే 91..
చిన్నపెండ్యాల దుకాణానికి అత్యధికం..
ఈనెల 27న లక్కీ లాటరీ


