రాంచందర్‌రావు అరెస్టు అప్రజాస్వామికం
జనగామ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. గురువారం జిల్లా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బుధవారం గోసంరక్షకుడు ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన ఎంఐఎం గూండా ఇబ్రహీంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోసంరక్షకుడిపై జరిగిన కాల్పుల గురించి ప్రశ్నించడానికి డీజీపీ ఆఫీస్‌కు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేశ్, రాష్ట్ర నాయకులు శివరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, కార్యదర్శి సతీశ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామ్ కోటి, పట్టణ అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శులు జగదీశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలి
పాలకుర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగల నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


