ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి
పాలకుర్తి టౌన్: ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలుకావాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారి నిర్మాణాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలు పంచాయతీ స్ధాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి మరమ్మతులు, బావుల పునరుద్ధరణ, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. సమీక్షలో పంచాయతీరాజ్ డీఈ రామలింగాచారి, ఏఈ శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


