
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు ఎంపిక
జనగామ రూరల్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఫుట్‌బాల్ జట్టుకు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ఫస్టియర్ విద్యార్థి బి.కిరణ్ ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ కిట్స్‌లో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన ఫుట్‌బాల టోర్నమెంట్‌లో కిరణ్ ప్రతిభ కనబర్చి సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యాడన్నారు. నవంబర్‌లో జరగనున్న టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున కిరణ్ పాల్గొంటాడని పేర్కొన్నారు. ఈసందర్భంగా కిరణ్‌ను ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ బి.భవాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మెహర్, రాజకుమార్ అధ్యాపకులు అభినందించారు.