
మార్మోగిన ఓంకార నాదం
బ్రహ్మముహూర్తంలో..
కార్తీక మాస పర్వదినం పురస్కరించుకుని బ్రహ్మముహూర్తంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించగా, ఆలయ ప్రాంగణాలు ఓం నమశ్శివాయ నినాదాలతో మార్మోగాయి. మొదటి రోజు కార్తీకమాస దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పుణ్యస్నానం చేసి, దీపారాధనలో పాల్గొన్నారు. కార్తీకమాసంలో ఆలయాల్లో రోజు వారీగా శివునికి ప్రీతికరమైన పూజలు, వ్రతాలు, దీపదానాలు, భజన తదితర భక్తి కార్యక్రమాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.
జనగామ: సృష్టి లయకారుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ఆరంభమైంది. జిల్లాలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దులగుట్ట పుణ్యక్షేత్రం, పాలకుర్తి శ్రీసోమేశ్వరస్వామి దేవాలయం, జనగామ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీ సంతోషీమాత, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర తదితర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు ప్రారంభించారు.
శివాలయాల్లో ఘనంగా
కార్తీక మాస పూజలు ప్రారంభం
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
జనగామ నుంచి శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మార్మోగిన ఓంకార నాదం

మార్మోగిన ఓంకార నాదం